Skip to content

Kajal Aggarwal Accident: Actress Clarifies She is Safe

ప్రఖ్యాత నటి కాజల్ అగర్వాల్ గురించి ఒక అప్ర‌మత్తం చేసే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది ఆమె (Kajal Aggarwal Accident) రోడ్ యాక్సిడెంట్‌లో మరణించారని రూమర్లు వ్యాప్తి చేశారు. ఈ తప్పుడు వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి.

దీన్ని గమనించిన కాజల్ స్వయంగా సోషల్ మీడియాలో స్పందించారు. ఆమె స్పష్టంగా తెలిపింది:

“నేను రోడ్ యాక్సిడెంట్‌లో మరణించానని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుడు, ఆధారరహితమైనవి. నిజం చెప్పాలంటే ఇవి కొంచెం హాస్యాస్పదంగా కూడా అనిపిస్తున్నాయి.”
“దేవుని కృపతో నేను పూర్తిగా బాగానే ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను. ఏ సమస్యా లేదు.”
“ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మకండి, షేర్ చేయకండి. మనం పాజిటివిటీ, నిజం పైన దృష్టి పెట్టుదాం.”

కాజల్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇలాంటి Fake News వల్ల కలిగే ప్రమాదాలను ఇది మరోసారి చాటిచెప్పింది. గతంలో కూడా Shah Rukh Khan, Katrina Kaif లాంటి పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు ఇలాంటి Death Hoax Rumors బారిన పడ్డారు.

Exit mobile version